టీఆర్ఎస్‌లో వర్గపోరు...బెదిరింపులకు దిగిన స్థానిక ఎమ్మెల్యే

x
Highlights

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీఆర్ఎస్‌లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. బెల్లంపల్లి కౌన్సిలర్లు 2 వర్గాలుగా చీలిపోయారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీఆర్ఎస్‌లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. బెల్లంపల్లి కౌన్సిలర్లు 2 వర్గాలుగా చీలిపోయారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ సునీత రాణిపై కొత్తగా చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్న కౌన్సిలర్ స్వరూప అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో బెల్లంపల్లిలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇప్పుడు రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లు తయారైంది పరిస్థితి.

మొత్తం 34 మంది కౌన్సిలర్లలో తనకు 29 మంది సభ్యుల మద్దతు ఉందని స్వరూప రాణి చెప్తోంది. వాళ్లంతా ఇప్పుడు క్యాంప్‌లో ఉన్నారు. ఈ క్యాంప్ పాలిటిక్సే ఇప్పుడు బెల్లంపల్లిలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఇష్యూలోకి స్థానిక ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఎంటరయ్యారు. ప్రస్తుతమున్న సునీతా రాణినే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కొనసాగించేందుకు ఎలాగైనా క్యాంప్‌ను తీసేయించేందుకు ఆయన చేసిన ఫలితాలు ప్రయత్నించలేదు. ఈ క్రమంలో వ్యతిరేక వర్గంపై బుజ్జగింపుల పేరుతో బెదిరింపులకు దిగారు. క్యాంప్ నుంచి బయటకు రావాలని కౌన్సిలర్ల కుటుంబసభ్యులన బెదిరిస్తున్నారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య 34వ వార్డు కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో హల్‌చల్ చేస్తోంది. మర్యాదగా తాము చెప్పింది వింటే ఓకే లేకపోతే అందరి లొసుగులు బయటపెట్టి ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టాలో తనకు తెలుసని హెచ్చరించారు. ప్రభుత్వం, కేసీఆర్ తలచుకుంటే ఏమైనా చేస్తారని క్యాంప్ లేపేయడం ఎంతసేపని అన్నారు.

34 మంది కౌన్సిలర్లలో ఎమ్మెల్యే వర్గంలో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. అందుకే ఈ ఇష్యూను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్‌లో కూడా పదే పదే ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పేరు ఉటంకిస్తూ బెదిరింపులకు దిగారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన స్వరూప భర్త రమేష్‌పై కేసు నమోదు కావడం స్థానిక రాజకీయాలను హీటెక్కించింది. తనను రాజకీయంగా ఎదుర్కొలేకే ఎమ్మెల్యే కేసులు వేయిస్తున్నారని స్వరూప ఆరోపిస్తోంది. ఇంతలోనే ఎమ్మెల్యే ఆడియో బయటకు రావడం బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు దిగడం కలకలం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories