టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు 6 నెలల జైలు శిక్ష

Submitted by arun on Wed, 02/14/2018 - 13:39
chinta

మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. గత ఎన్నికల్లో చింతమనేని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన 2011లో గ్రామసభలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకుని, ఎంపీ కావూరి సాంబశివరావుపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఈ కేసులో నేడు తీర్పు వెలువడింది. చింతమనేని దోషిగా నిరూపితం కావడంతో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

English Title
mla chinthamaneni 6months jail

MORE FROM AUTHOR

RELATED ARTICLES