ముంబైలో మిరాకిల్‌...రోడ్డుపై కూర్చున్న బాలుడిపై నుంచి పోయిన కారు

x
Highlights

అదృష్టం అంటే ఈ బుడ్డోడిదే . యముడు ఎదురుగా వచ్చిన ఏమీ జరగలేదు. అదృష్టవంతుడు కాబట్టే మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. భూమిపై నూకలు ఉంటే భూకంపం...

అదృష్టం అంటే ఈ బుడ్డోడిదే . యముడు ఎదురుగా వచ్చిన ఏమీ జరగలేదు. అదృష్టవంతుడు కాబట్టే మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. భూమిపై నూకలు ఉంటే భూకంపం నుంచైనా బయటపడతాం అనేదానికి ఉదాహరణగా నిలిచాడు. కారు పిల్లాడి మీద నుంచి వెళ్లిన క్షేమంగా బయట పడిన ఘటన ముంబైలో జరిగింది.

ఫ్రెండ్‌తో సరదాగా ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్న చిన్నోడు షూ లేస్‌ ఊడిపోవడంతో కారు పక్కన కూర్చోని తాపీగా కట్టుకుంటున్నాడు. అంతలో ఓ యువతి రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారు సడెన్‌గా రైట్ సైడ్‌కి తిప్పింది. కింద కూర్చున్న బాబును గమనించ కుండా వేగంగా ముందుకు తీసింది. దీంతో కారు కాస్త బాబుపై నుంచి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో బాబు కారు మధ్యలోకి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కారు కింద నుంచి క్షణాల్లో లేచి మళ్లీ ఫ్రెండ్‌తో ఆడుకునేందుకు పరుగులు తీశాడు. రాత్రి జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories