దారుణం : ఐసీయూలో ఉన్న బాలికపై అత్యాచారం

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 09:09
minor-girl-gang-raped-inside-icu-uttar-pradesh

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మృగాళ్లు. నాలుగురోజుల రోజుల కిందట బరేల్లీలోని గ్రామీణ  ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక పాము కాటుకు గురైంది. దాంతో ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాలికను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు.. ఐసీయూలోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లిపోయారు. చికిత్స అనంతరం బాలిక కోలుకోవడంతో  ఆమెను జనరల్ వార్డుకు తరలించారు. దాంతో జరిగిన దుర్ఘటనను.. బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలికను విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు, మరో నలుగురిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

English Title
minor-girl-gang-raped-inside-icu-uttar-pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES