ఆ రూమర్లను ఖండించిన మంత్రి నారాయణ

Submitted by nanireddy on Fri, 10/05/2018 - 16:29
minister-narayana-respond-on-it-raids-roomars

నిన్నటినుంచి ఏపీలో వివిధ సంస్థల అధినేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ దాడులు మంత్రి నారాయణ విద్యా సంస్థలపై కూడా జరిగాయని రూమర్లు వచ్చాయి. అయితే ఆ రూమర్లను ఖండించారు మంత్రి నారాయణ. తమ విద్యాసంస్థలపై ఎలాంటీ ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో టీడీపీకి చెందిన నేతల సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. టీడీపీ నేతలపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు . కక్ష సాధింపులలో భాగంగానే బీద మస్తాన్ రావుపై ఐటీ సోదాలు సాగుతున్నాయని విమర్శించారు . భయపెట్టి లోంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

English Title
minister-narayana-respond-on-it-raids-roomars

MORE FROM AUTHOR

RELATED ARTICLES