మరో సీటు కన్ఫర్మ్ చేసిన లోకేష్.. పితలాటకం షురూ..

Submitted by nanireddy on Wed, 07/11/2018 - 06:50
minister-nara-lokesh-conform-emmigannuru-assembly-ticket

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అయన క్రమంగా పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మరోసారి కర్నూల్ ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా ఎమ్మిగనూర్ అసెంబ్లీకి క్లారిటీ ఇచ్చారు. జయనాగేశ్వర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూల్ జిల్లాలో లోకేష్ పర్యటనకు మంచి స్పందన రావడంతో తమ్ముళ్లలో జోష్ కనిపిస్తోంది. ఇదిలావుంటే లోకేష్ ప్రకటనపై మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అసంతృప్తిగా ఉన్నారు.గత ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీకి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఎస్వీ  మోహన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. దాంతో వివాదం రాజుకుంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న టీజీ వచ్చే ఎన్నికల్లో కర్నూల్ నుంచి తన కుమారుడిని బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ అయన కోరికకు మంత్రి నారా లోకేష్ గండి కొట్టారు. దీంతో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. 

English Title
minister-nara-lokesh-conform-emmigannuru-assembly-ticket

MORE FROM AUTHOR

RELATED ARTICLES