ఏపీలో ముందస్తు ఎన్నికలపై మంత్రి లోకేష్ స్పందన

Submitted by arun on Thu, 09/13/2018 - 12:57
nk

ఆంధ్ర ప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనేది ప్రచారం మాత్రమేనని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండాలనేది ప్రజల సెంటిమెంట్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. అయినా ముందస్తు ఎన్నికల మూడ్‌లో ఏపీ ప్రజలు లేరన్నారు. అసలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ అధికారం చేపట్టేది తెలుగుదేశం పార్టీదేనని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ప్రతి నిమిషం నిమగ్నమయ్యామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలని ప్రజల కోరిక అని అయితే ఐదేళ్ల పాటు తెలంగాణలో ప్రభుత్వం నడవకపోవడం విచారకరమని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీ కోసం చంద్రబాబు పోరాడారని ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువను అంతా చూశారని అన్నారు. చంద్రబాబును, టీడీపీ నేతలను అరెస్ట్ చేసినా నాడు వెనక్కి తగ్గలేదన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసినందున చంద్రబాబు బెయిల్ కూడా నిరాకరించారని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.

English Title
Minister Nara Lokesh also Respond on Early Election

MORE FROM AUTHOR

RELATED ARTICLES