మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం

Submitted by arun on Sat, 04/14/2018 - 17:44
ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్రభారతిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడేందుకు లేవగా ఓ వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జ్యోతిరావు పూలేకు నివాళి అర్పించి, అంబేద్కర్ కు ఎందుకు అర్పించలేదని ప్రశ్నించాడు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆందోళన చేస్తున్న వ్యక్తితో మాట్లాడాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవిని కేటీఆర్ ఆదేశించారు. స్టేజీ పైనుంచి కిందకు దిగిన రవి.. ప్రసంగానికి అడ్డుతగిలిన వ్యక్తిని బయటకు పంపేశారు.

Minister ktr participates in T Pride event in Ravindra bharati

English Title
minister ktr participates in t pride event in ravindra bharati

MORE FROM AUTHOR

RELATED ARTICLES