త‌ప్పుడు పోస్టులు పెడితే జైలుకు పంపిస్తా

త‌ప్పుడు పోస్టులు పెడితే జైలుకు పంపిస్తా
x
Highlights

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై...

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం గురించి మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను టీఆర్ఎస్ లోనే పుట్టానని చివరి వరకు టీఆర్ఎస్ లోనే ఉంటానని హరీష్ రావు తెలిపారు.

మంత్రి హరీష్ రావుపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. త‌ాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. త‌నపై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నార‌న్న హ‌రీష్ రావు వారిపై డీజీపీకి ఫిర్యాధు చేసిన‌న‌ట్లు తెలిపారు. త‌ను పార్టీ మారుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతామని చెప్పారు. త‌న‌పై త‌ప్పుడు పోస్టింగ్ లు పెట్టే వాళ్ళు జైలు కెళ్లేందుకు సిద్దంగా ఉండాల‌ని హెచ్చరించారు.

టీఆర్ఎస్ లో తాను క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల కార్య‌క‌ర్త‌గా చెప్పిన హరీష్‌ త‌ాను ఎక్క‌డి నుంచి పోటీ చేయాలో కేసీఆరే నిర్ణ‌యిస్తార‌ని తెలిపారు. టీఆర్ఎస్ పుట్టిన తాను కడవరకు టీఆర్ఎస్ లోనే ఉంటానన్నారు. కెసిఆర్ మాటే త‌న‌ బాటని చెప్పారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన త‌న‌పై ఇలాంటి పుకార్లు న‌మ్మొద్ద‌న్నారు‌.

కాంగ్రెస్ నేత‌ల బ‌స్సు యాత్ర‌పై మంత్రి హ‌రీష్ రావు ఫైర్ అయ్యారు. త‌మ ఉనికి చాటుకునేందుకే కాంగ్రెస్ నేత‌లు బ‌స్సు యాత్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 2019లో కూడా తాము అధికారంలోకి రాలేమ‌ని తెలిసే సంబందంలేని హామీలిస్తున్నార‌ని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారానికి ఇప్పటికైనా ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలని నమ్మోద్దని అభిమానులను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories