లగడపాటి సర్వేపై హరిశ్‌రావు ఘాటు విమర్శలు

లగడపాటి సర్వేపై హరిశ్‌రావు ఘాటు విమర్శలు
x
Highlights

లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్‌ పోల్ సర్వేల స్పెషలిస్ట్ ఆయన ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే వార్ వన్ సైడ్ కావల్సిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి తన సర్వే...

లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్‌ పోల్ సర్వేల స్పెషలిస్ట్ ఆయన ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే వార్ వన్ సైడ్ కావల్సిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి తన సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. గతంలో ఆయన చేసిన సర్వేలన్నీ నిజమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ ఛానళ్ళ సర్వేలకు భిన్నమైన ఫలితాలను వెల్లడించి అందరిలోనూ మరింత సస్పెన్స్ పెంచేశారు. అయితే తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకొస్తుందన్న లగడపాటి సర్వేపై మంత్రి హరీశ్ రావు తీవ్రవిమర్శలు గుప్పించారు. గతంలో చేసిన ఆయన చేసిన సర్వేలలో ఏ ఒక్కటైనా నిజమైందా అని గతంలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని బల్లగుద్ది చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన సర్వేలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ ఒక్కరు కూడా గెలవరని వ్యాఖ్యనించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పిననేతలు అందుకు సిద్దంగా ఉండాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories