మాజీ మంత్రి ఆనంను కలిసిన మంత్రి గంటా..

Submitted by nanireddy on Sun, 06/24/2018 - 15:38
minister-ganta-srinivasarao-meets-anam-ramanarayana-reddy-in-nellore

నెల్లూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మంత్రి గంట శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్బంగా  మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం ఆనంతో మంత్రి గంటపాటు చర్చలు జరిపారు. టీడీపీకి రాజీనామా చేస్తారని ఊహించిన గంటా వైసీపీలోకి వెళతానంటున్న ఆనంతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరతారని రాజకీయా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటు పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూప్ తయారైందని అలకబూనారు మంత్రి గంటా.  భీమిలి నియోజకవర్గంలో  సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో గంటా గెలుపు కష్టమేనన్న టీడీపీ వర్గాల  సంకేతాలతో అయన అధిష్టానంపై కినుక వహించారు. అయితే ఇటీవల విశాఖలో సీఎం కార్యక్రమంలో  పాల్గొన్న గంటా మెత్తబడ్డట్టు పైకి కనిపించినా పార్టీ నేతలతో  అంటీముట్టనున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సడన్ గా  ఆనం తో భేటీ అయి టీడీపీ నేతలకు టెన్షన్ తెప్పిస్తున్నారు గంటా. ఇక పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని.. సీనియర్ నేతనైనా తనకు  గుర్తింపు లేదన్న కారణంతో అసంతృప్తితో ఉన్నారు ఆనం. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ అధిష్టానంతో చర్చలు జరిపిన అయన వచ్చే నెల  వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.  

English Title
minister-ganta-srinivasarao-meets-anam-ramanarayana-reddy-in-nellore

MORE FROM AUTHOR

RELATED ARTICLES