ఇంటర్ విద్యార్థినిని హత్య చేసి.. ఆపై..

Submitted by nanireddy on Fri, 11/09/2018 - 07:29
miners-who-killed-an-inter-student

విశాఖ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ బాలికను హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన చోడవరంలో జరిగింది. చోడవరం కోటవీధికి చెందిన పిల్లల ఈశ్వరరావు, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పద్మావతి (17) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. వీరి ఇంటికి ఎదురుగా ఉంటున్న మైనర్‌ బాలునితో ప్రేమలో పడింది.  ఇది తెలిసిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. మంగళవారం రాత్రి  రాజు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే ఆమె మంగళవారం రాత్రి నుంచి ఇంటికి రాలేదు దాంతో కుటుంబసభ్యులు ఆమెకోసం గాలించి.. ఫలితం లేకపోయేసరికి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్పట్టగా.. వారికి చోడవరం ఫారెస్టు డిపో సమీపంలో బాలిక హత్యకు గురైనట్టు తెలిసింది. హత్యచేశాక పెట్రోలు పోసి తగులబెట్టడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. సంఘటన స్థలంలోని ఆనవాళ్లు ప్రకారం ఆమె తమ కుమార్తెనని ఈశ్వరరావు  దంపతులు ధృవీకరించారు. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారికీ అనకాపల్లిలో విచారిస్తున్నారు.

English Title
miners-who-killed-an-inter-student

MORE FROM AUTHOR

RELATED ARTICLES