ప్రజాఫ్రంట్‌ వైపే ప్రజానాడి..

x
Highlights

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు, పందేలు జోరందుకుంటున్న తరుణంలో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి నిన్న మరోసారి తన సర్వే అంచనాలు ప్రజల ముందుంచారు...

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు, పందేలు జోరందుకుంటున్న తరుణంలో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి నిన్న మరోసారి తన సర్వే అంచనాలు ప్రజల ముందుంచారు ప్రస్తుతానికి మహాకూటమికే నాడి అనుకూలంగా ఉందంటూనే పోలింగ్ శాతమే ఈసారి పార్టీల గెలుపు, ఓటములను నిర్దేశిస్తుందన్నారు 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారన్న లగడపాటి వారిలో ముగ్గురి పేర్లను నిన్న వెల్లడించారు.

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మరోసారి జోస్యం చెప్పారు ప్రస్తుతానికి నాడి ప్రజా కూటమికి అనుకూలంగా ఉందని ఎన్నికల సమయానికి ఎలా మారుతుందో చెప్పలేమని అన్నారు పోలింగ్ శాతం పెరిగితే ప్రజాకూటమి గెలిచే అవకాశం ఉందని పోలింగ్ శాతం తగ్గితే హంగ్ వచ్చే అవకాశాలున్నాయనీ అన్నారు. అంతేకాదు జిల్లా వారీగా కూడా ఏ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయో వెల్లడించారు.

హైదరాబాద్ లో ఎంఐఎం బలంగా ఉందన్నారు ఇక మహబూబ్ నగర్, కరీంనగర్లలో పోటీ హోరా హోరీగా ఉందన్నారు. ఈసారి ఫలితాల్లో బిజెపికి జిల్లాల్లో కూడా సీట్లు దక్కుతాయన్నారు. గతంలో కంటే బీజేపి పరిస్థితి మెరుగు పడుతుందని లగడపాటి ఊహిస్తున్నారు పార్టీల గెలుపు అవకాశాలు పోలింగ్ శాతంపై ఆధారపడి ఉంటాయని,68.3 శాతం పోలింగ్ జరిగితే హంగ్ వచ్చే అవకాశం ఉందని పోలింగ్ శాతం పెరిగితే మాత్రం అది కాంగ్రెస్ కు అనుకూలంగా మారొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. గతంలో 8 మంది స్వతంత్రులు గెలుస్తారని ప్రకటించిన లగడపాటి అప్పట్లో ఇద్దరి పేర్లు చెప్పారు నిన్న మరో ముగ్గురి పేర్లను వెల్లడించారు.

లగడపాటి ఫ్లాష్ టీమ్ సర్వే ప్రకారం8 మంది ఇండిపెండెట్లు ఈ ఎన్నికలలో గెలిచే అవకాశముంది. మక్తల్ లో జలంధర్ రెడ్డి, బెల్లంపల్లిలో జి. వినోద్, ఇబ్రహీం పట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, నారాయణ్ పేట్ లో శివకుమార్ రెడ్డి, బోధ్ లో అనిల్ జాదవ్ గెలుస్తారని తెలిపారు. మరో ముగ్గురి పేర్లను మరో రెండు రోజుల్లో చెబుతానన్నారు. తన సర్వేలు గతంలో కూడా నిజాలయ్యాయని, తన పేరుతో ఎవరు పడితే వారు సర్వేలు చేసేసి ఇష్టానుసారం ప్రకటించేస్తున్నారని లగడపాటి అన్నారు తాను మీడియా ముందుకొచ్చి మైకు ముందు చెప్పిన మాటలనే నమ్మాలని లగడపాటి కోరారు. తన మిత్రుడు యర్రం శెట్టి సాయి తాను కలిసి ఇలా సర్వేలు చేయిస్తుంటామని, ఇది కేవలం ఆసక్తి కోసం తప్పితే దీని వెనుక ఏ ఉద్దేశాలూ లేవని లగడపాటి అన్నారు. తనకు ఎవరిపైనా ద్వేషం లేదని, ఎవరికీ అనుకూలం కాదని చెబుతూ గతంలో సొంత పార్టీ ఓడిపోతుందని చెప్పిన వ్యక్తినీ తానేని అది జనం గుర్తుంచుకోవాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories