ఉద్యోగాల కోతను ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌

Highlights

టెక్నాల‌జీ జెయింట్ మైక్రోసాఫ్ట్.. కంపెనీ రీఆర్గ‌నైజేష‌న్‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా సుమారు 3 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నుంది. ఈ ఉద్యోగాల...

టెక్నాల‌జీ జెయింట్ మైక్రోసాఫ్ట్.. కంపెనీ రీఆర్గ‌నైజేష‌న్‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా సుమారు 3 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నుంది. ఈ ఉద్యోగాల కోత మొత్తం ఆ కంపెనీకి ఉన్న సేల్స్‌ ఫోర్స్‌లో 10 శాతం తక్కువేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ తాజాగా చేపడుతున్న ఈ ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌లో ఉంటుందా? లేదా? అనేది ఇంకా స్పష్టంకాలేదు. తమ కస్టమర్లకు, భాగస్వాములకు మంచి సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మార్పులను చేపడుతున్నామని మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. నేడు తాము తీసుకునే చర్యలతో కొంత మంది ఉద్యోగులు తమ తమ స్థానాల నుంచి వైదొలగాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కంపెనీలో ఉన్న మొత్తం సేల్స్ ఉద్యోగుల్లో ప‌ది శాతం వ‌ర‌కు ఉద్యోగాలు కోల్పోనున్నారు. అందులోనూ వీళ్ల‌లో 75 శాతం అమెరికా బ‌య‌ట ఉన్నావాళ్లే. మైక్రోసాఫ్ట్ త‌మ క్లౌడ్ స‌ర్వీసెస్ ప్రొడ‌క్ట్ అయిన అజ్యూర్‌ను ఎలా ప్ర‌మోట్ చేయాల‌న్న‌దానిపైనే దృష్టి సారిస్తున్న‌ది. ఇందులో అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్‌కు గట్టి పోటీ ఉంది. అయితే చివ‌రి త్రైమాసికంలో అంత‌కుముందుతో పోలిస్తే అజ్యూర్ 93 శాతం వృద్ధి సాధించింది. మైక్రోసాఫ్ట్ అమెరికాలో 71 వేల మంది, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షా 21 వేల మంది ప‌ని చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories