టీచర్ తల నరికి.. ఊరంతా తిరిగాడు..

Submitted by arun on Wed, 07/04/2018 - 13:52
Jharkhand

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి.. స్కూల్ టీచర్ తల నరికి, ఆ తలను పట్టుకుని వీధుల్లో తిరిగాడు. జనం భయంతో పరుగులు తీశారు. సెరైకేలా ఖర్సావాన్ జిల్లా ఖప్సారాయ్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సుక్రూ హెస్సా అనే 30 ఏళ్ల మహిళ సెరైకేలా ఖర్సావాన్ జిల్లా ఖప్సారాయ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా  పనిచేస్తోంది. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(26)  ఎప్పుడూ ఆమెవైపు అదోలా చూసేవాడు. మంగళవారం అతడు స్కూలు వద్దకు వెళ్లి.. ఆమెను బయటికి రావాలని అరచి కేకలేశారు. సుక్రూ పట్టించుకోలేదు. దీంతో హరి.. స్కూల్లోకి చొరబడి ఆమెను బయటకు ఈడ్చుకొచ్చాడు. తర్వాత ఆమెపై కత్తితో దాడి చేశాడు. తలను ఖండించి, చేత్తో పట్టుకుని అరుస్తూ తిరిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జంషెడ్‌ పూర్‌కు చెందిన సుక్రూ ఖప్సారాయ్ గ్రామానికి బదిలీ అయ్యాక మొదట్లో హరి కుటుంబానికి చెందిన ఇంట్లో అద్దెకుండేదని, అతని ప్రవర్తన నచ్చక ఇటీవలే వేరే ఇంటికి మారిందని, అందుకే అతడు చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

English Title
Mentally challenged man beheads teacher in Jharkhand

MORE FROM AUTHOR

RELATED ARTICLES