అభిమానుల‌కు మెహ‌రీన్ స్వీట్ వార్నింగ్

Submitted by lakshman on Sun, 03/11/2018 - 13:03
mehreen pirzada

హిరోయిన్ మొహ‌రీన్ అభిమానుల‌కు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది. హీరోయిన్ మెహరీన్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. అది ఎంతలా అంటే ఒంటిపై పచ్చబొట్టు వేయించుకునేలా. అయితే ఇదే విష‌యం ఈ అమ్మ‌డుకు న‌చ్చ‌లేదట‌.  ఓ అభిమాని చేసిన ఈ పిచ్చి పనితో బాగా హర్టయ్యింది. ఇదేం పిచ్చి రా బాబూ అనుకుందో ఏమో... వెంటనే ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ స్పందించింది. 

తన కోసం ఇలాంటి పిచ్చి ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని చెప్పింది. దీని కోసం మిమ్మల్ని మీరు బాధించుకోవద్దని స్వీట్‌గా అన్న‌ది. అంతేకాదు మరీ ఇంత అభిమానమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది కూడా ఈ అమ్మ‌డు.అభిమానం ఉంటే ఉండాలి కాని.ఇలాంటివి చేస్తే ఎలా అని ప్రశ్నించింది. ఫ్యాన్ లవ్, బిగ్ థాంక్యూ. ఐ లవ్ యూ ఆల్ అంటూ అభిమానుల్లో జోష్‌ నింపింది. 

మెహరీన్ అభిమాని ఒకరు ఇటీవలే తన మెడపై మెహరీన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఆ ఫోటో ఈ బ్యూటీకి చేరడంతో.ఆమె ఆవేదనతో ట్వీట్ చేశారు. మరోవైపు నెటిజన్లు పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తిపై మండిపడుతున్నారు. ఎంత అభిమానం ఉన్నా. ఎవరైనా ఇలా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

English Title
mehreen gives sweet warning to her fans

MORE FROM AUTHOR

RELATED ARTICLES