మైనార్టీలో పడ్డ ముఫ్తీ సర్కార్...ముఫ్తీ దారెటో..?

Submitted by arun on Tue, 06/19/2018 - 18:10
Mehbooba

జమ్ము కశ్మీర్‌లో పిడిపి బిజెపి సంకీర్ణానికి తెర పడింది. మెహబూబా ముఫ్తీ సంకీర్ణ సర్కార్ నుంచి బిజెపి బయటకు వచ్చింది. మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మొహబూబా సర్కార్ సంక్షోభంలో పడింది. త్వరలోనే గవర్నర్  పాలన విధించే అవకాశం ఉంది. బిజెపి మద్దతు ఉపసంహరించుకోవడంతో పిడిపికి మరోదారి లేకపోయింది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందించారు.

రంజాన్ తర్వాత టెర్రరిస్ట్ వ్యతిరేక కార్యక్రమాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేర్పాటు వాదులతో మరోసారి చర్చలు జరపాలనే ఆమె సలహాతో కేంద్ర ప్రభుత్వం విభేదించింది. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా వారు సద్వినియోగపరుచుకోలేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ఉన్నారు.

కశ్మీర్ అసెంబ్లీలో ప్రస్తుతం బిజెపికి 25 మంది శానన సభ్యులు, పిడిపికి 28 మంది శానస సభ్యులు ఉన్నారు. మేజిక్ ఫిగర్ 45. ప్రస్తుతం బిజెపి సంకీర్ణం నుంచి బయటకు రావడంతో పిడిపి ఒంటరి అయింది. మరో పార్టీ సాయం తీసుకోడానికి కూడా అవకాశం లేదు. సంకీర్ణం ఏర్పాటైన దగ్గర నుంచి ఇరు పార్టీల మధ్య బేధాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు సర్దుబాటు ధోరణితో ఇరు పార్టీలు సంకీర్ణాన్ని నడుపుకుంటూ వచ్చాయి. ఎట్టకేళకు సంకీర్ణం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితులు తలెత్తాయి. 

రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ సజ్జత్ బుఖారీ ఉగ్రవాదుల చేతిలో దారుణంగా కాల్పులకు గురికావడం కేంద్ర వైఖరిలో స్పష్టమైన మార్పు తీసుకువచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ వరుస ట్వీట్లతో ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. భద్రతా బలగాలకు పూర్తిస్తాయి స్వేచ్చను అందించారు. 

ఎట్టకేలకు బిజిపి తన తప్పును తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని బిజెపి పిడిపి కూటమి నాశనం చేసిందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆజాద్ స్పష్టం చేశారు. బిజెపి పిడిపి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జమ్ముకశ్మీర్‌లో కాల్పులు విరమణ ఉల్లంఘనలు ఎక్కువయ్యాయని ఆజాద్ గుర్తుచేశారు. 

జమ్ము కశ్మీర్‌లో బిజిపి పిడిపి సంకీర్ణానికి తెర పడడంతో శివసేన స్పందించింది. జమ్ము కశ్మీర్‌లో ఏర్పడిన ప్రభుత్వంపై గతంలో ఉద్ధవ్ థాకరే చెప్పిందే నిజమైందని శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తెలిపారు. బిజెపి పిడిపి కలయిక అపవిత్ర కలయిక అయి ఉద్ధవ్ థాకరే గతంలో చాలా సార్లు చెప్పారని సంజయ్ రౌత్ గుర్తుచేశారు.

జమ్ము కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బిజెపి బయటకు రావడంపై పిడిపి నేత రఫీ అహ్మద్ స్పందించారు. ఇదిక ఊహించని పరిణామమని ఆయన అన్నారు. జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడపడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించామని రఫీ అహ్మద్ తెలిపారు. జమ్ము వ్యాలీలో పరిస్థితులు ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉన్నాయని రఫీ అహ్మద్ తెలిపారు.

English Title
Mehbooba Mufti resigns after BJP pulls out of alliance with PDP in IOK

MORE FROM AUTHOR

RELATED ARTICLES