మీనా కూతురు మ‌ళ్లీ వ‌స్తోంది

మీనా కూతురు మ‌ళ్లీ వ‌స్తోంది
x
Highlights

నిన్న‌టి త‌రం అందాల న‌టి మీనా న‌ట ప్ర‌స్థానం బాల‌న‌టిగానే ప్రారంభ‌మైంద‌న్న సంగ‌తి తెలిసిందే. 'సిరివెన్నెల' త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా గుర్తుండిపోయే...

నిన్న‌టి త‌రం అందాల న‌టి మీనా న‌ట ప్ర‌స్థానం బాల‌న‌టిగానే ప్రారంభ‌మైంద‌న్న సంగ‌తి తెలిసిందే. 'సిరివెన్నెల' త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా గుర్తుండిపోయే పాత్ర‌లు చేసిన మీనా.. 'సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు' నుంచి హీరోయిన్‌గా ఫుల్ బిజీ అయ్యింది. పెళ్ల‌య్యాక సినిమాల‌ని త‌గ్గించుకున్న మీనా.. ఆ మ‌ధ్య 'దృశ్యం'లో వెంక‌టేష్ భార్య‌గా అల‌రించింది. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీల‌క పాత్ర పోషిస్తోంది.

ఇదిలా ఉంటే.. మీనా కూతురు నైనికా కూడా బాల‌న‌టిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది త‌మిళ చిత్రం 'తెరి' (పోలీస్‌)లో విజ‌య్‌కి కూతురిగా న‌టించిన ఆరేళ్ల నైనికా.. ఇప్పుడు అర‌వింద్ స్వామి, అమ‌లాపాల్ న‌టిస్తున్న 'భాస్క‌ర్ ఒరు రాస్కెల్‌' అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో అమ‌లా కూతురి పాత్ర‌లో నైనికా క‌నిపించ‌నుంది. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన 'భాస్క‌ర్ ది రాస్కెల్' ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. త‌మిళ చిత్రాల‌కే పరిమిత‌మ‌వుతున్న నైనికా.. తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories