ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) రివ్యూ

ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) రివ్యూ
x
Highlights

కుటుంబాల్లో అన్నతమ్ముళ్లు మధ్య వదినలు రావడం కామన్. మరి వదినలు వస్తే తమ్ముళ్లు అన్నల్ని వదులుకుంటారా..? వదులు కోరు. అన్నంటే తమ్ముడికి ఎప్పటికీ ప్రేమే....

కుటుంబాల్లో అన్నతమ్ముళ్లు మధ్య వదినలు రావడం కామన్. మరి వదినలు వస్తే తమ్ముళ్లు అన్నల్ని వదులుకుంటారా..? వదులు కోరు. అన్నంటే తమ్ముడికి ఎప్పటికీ ప్రేమే. అలాంటి ప్రేమా ఆప్యాయాతల మధ్య వదిన - మరిది మధ్య జరిగే ఓ చిన్న సంఘర్షణే ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి. మరి ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి వదినకి మధ్య ఏం జరిగింది. వరుస విజయాలతో జోరుమీదున్న నాని. ఓ మై ఫ్రెండ్ డైరక్టర్ వేణుశ్రీరాం దర్శకత్వం వహించిన ఎంసీఎంతో మరో విజయం సాధిస్తారా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ ఏమిటంటే..

మధ్య తరగతి కుటుంబానికి చెందిన నాని (నాని)కి చిన్నతనంలో అమ్మచనిపోవడంతో అన్న (రాజీవ్ కనకాల) తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ. తమ్ముడికి అన్నే సర్వస్వం. అయితే వదిన జ్యోతి (భూమిక చావ్లా) రావడంతో అన్నతమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతుంది. దానికి కారణం వదినేనే ఫీలింగ్ లో ఉంటాడు.

కట్ చేస్తే అన్నయ్య ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది.

వరంగల్ వచ్చిన నానికి పల్లవి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. పల్లవి స్పీడు..నాని ప్రేమ ఈ రెండు కలగలిసి ..తొలిచూపులోనే పల్లవి పెళ్లి ప్రపోజల్ తెస్తుంది. అయితే ఆ పెళ్లి ప్రపోజల్ కి ఫిదా అయిన నాని ఆమె ప్రేమలో మునిగి తేలుతుంటాడు.

ఈ తరుణంలో శివశక్తి ట్రావెల్స్ యజమాని శివ(విజయ్)కు .. రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి మధ్య వైరం కలుగుతుంది. ఆ వైరంతో శివ జ్యోతిని చంపేందుకు కుట్రపన్నుతాడు. ఆ కుట్రను తెలుసుకున్న మరిది నాని కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో శివతో వైరం పెరుగడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితుల్లో వదినను ఎలా రక్షించుకొన్నాడు? తొలిచూపులోనే సాయి పల్లవి పెళ్లి ప్రపోజ్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటీ? ఏ ఉద్యోగం, పనిపాట లేకుండా తిరిగే నానికి పల్లవితో పెళ్లి కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర కథ.

ఫర్మామెన్స్ :

ఈ సినిమాలో కథా, కథనం ఎలా ఉన్నా వదిన , మరిది మధ్య ప్రేమానురాగాల్ని తెరకెక్కించడంలో డైరక్టర్ వేణుశ్రీరామ్ సఫలీకృతుడయ్యాడనే చెప్పుకోవచ్చు. ఐదేళ్ల తర్వాత మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలలతో ఎంసీఏ కథను అల్లుకొన్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించించే నాని కథానాయకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. తొలి భాగంలో కథను ఆసక్తిగా నడిపిన దర్శకుడు.. రెండో భాగంలోకి వచ్చే సరికి తడబడినట్టు కనిపిస్తాడు.

సెకండాఫ్‌లో

ఫస్టాఫ్ లో బంధాలు, బంధుత్వాలు గురించి వివరించిన డైరక్టర్ సెకెండాఫ్ లో గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర బాగున్నా..హీరోయిన్ సాయి పల్లవి, వదిన భూమికల పాత్రల విషయంలో బాగున్నా విలన్ విషయం కొంచెం శ్రద్ద తీసుకున్నట్లైతే బాగుండేదనిపిస్తుంది.
దర్శకుడు వేణు శ్రీరాం ప్రతిభ

వేణుశ్రీరాం డైరక్టన్ చాలా బాగుంది. మధ్య తరగతి కుటుంబాల్లో ప్రేమలు ఎలా ఉంటాయ్. నాని, సాయి పల్లవి, భూమికల పాత్రల్ని మలిచిన తీరు చూస్తే దర్శకుడిగా ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించుకొ తన వంతు ప్రయత్నమే చేశాడనిపిస్తుంది. రెండో భాగంలో కథ గురించి కొంత మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎంసీఏ బ్లాక్‌బస్టరే అయి ఉండేదేమో.

మరోసారి నాని..

న్యాచురల్ స్టార్ నాని బిరుదుకు తగ్గట్లే తన దైన న్యాచరుల్ నటనతో రెచ్చిపోయాడు. అన్న ఇష్టపడే తమ్ముడిగా.. వదినపై ఈర్ష్య పడే మరిది.. అలాగే వదిన అంటే అమితంగా ఇష్టపడేవ వ్యక్తిగా రకాల ఫ్లేవర్ ఉన్న పాత్రను సమర్ధవంతంగా పోషించి మెప్పించాడు. ప్రతీ మధ్య తరగతి యువకుడి తనను చూసుకునే విధంగా ఆ పాత్రను మలిచేలా కృషి చేశాడు. నాని యాక్టింగ్ విషయానికి వస్తే ఆ పాత్రలో ఎలాంటి లోపాలు కనిపించవు. డ్యాన్సులు, ఫైట్లతో మెప్పించాడు.

ఆకట్టుకొన్న సాయి పల్లవి

తొలితెలుగు సినిమా ఫిదాతో ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి..ఎంసీఏలో అల్లరి, చిలిపి పాత్రలో ఆకట్టుకొంటుంది. ఇక డ్యాన్సులతో దుమ్ము దులిపేసింది. స్క్రీన్ మీద నానితో కలిసి ఉంటే ప్రేక్షకుడు సాయిపల్లవిని చూసేంతగా ఆకట్టుకొన్నది.
భూమిక అదనపు ఆకర్షణ

వదిన పాత్రంలో భూమిక హుందాగా కనిపించింది. యువకుడు, ఖుషీ, మిస్సమ్మ లాంటి చిత్రాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకొన్న భూమిక చావ్లా కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరమైంది. ఈసారి ఎంసీఏ చిత్రంలో హీరోయిన్‌గా కాకుండా బలమైన క్యారెక్టర్‌ పాత్రలో మళ్లీ భూమిక తెర మీద మెరిసింది.

మిగిలిన నటీనటుల్లో ఎవరికి వారు అలరించారు. ఫైనల్‌గా నాని, సాయి పల్లవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం ఎంసీఏ. మధ్య తరగతి కుటుంబ కథకు భూమిక అదనపు ఆకర్షణగా మార్చారు. నానికి మల్టీప్లెక్స్, ఏ సెంటర్లలో మంచి మార్కెట్ ఉంది. ఇక బీ, సీ కేంద్రాల్లోని ప్రేక్షకులు ఆదరిస్తే ఈ చిత్రం సినిమా యూనిట్‌కి చక్కటి విజయం సొంతమవ్వడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories