దడ పుట్టిస్తున్న ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి కార్డు

Submitted by admin on Tue, 12/12/2017 - 15:45

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఎప్పుడు అనే విషయం ఇంకా బయటకు వెల్లడి కాకపోయినప్పటికీ... పెళ్లి కార్డుకు సంబంధించిన ఓ వార్త మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కార్డు ధర ఎంతో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ కార్డుకయ్యే వ్యయంతో ఒక ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయవచ్చట. ముఖేష్ అంబానీ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుల్లో ఒకరు. అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ ముఖేష్‌ను భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. అందుకే అతని కుమారుని వివాహం అంగరంగవైభవంగా జరగనుంది. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆకాష్ అంబానీ వివాహం డిసెంబరులో జరగనుంది. ఆకాష్ పెళ్లి కార్డు ఖరీదు సుమారు లక్షన్నర. ఈ కార్డు తయారీలో బంగారాన్ని వినియోగించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారని వినికిడి.

English Title
mbani-son-wedding-card-know-price

MORE FROM AUTHOR

RELATED ARTICLES