కాంగ్రెస్ కు భారీ షాక్ ఇచ్చిన బీఎస్పీ అధినేత మాయావతి

Submitted by arun on Wed, 10/03/2018 - 17:09
Mayawati

కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత మాయావతి భారీ షాక్ ఇచ్చారు.. రానున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఆమె విరుచుకుపడ్డారు. బీఎస్పీని అంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆమె అన్నారు.. ఇక పొత్తు చెడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగే కారణమని ఆమె ఆరోపించారు. తమతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం తనపై ఎక్కడ ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తామని బెదిరిస్తున్నారని మాయావతి విమర్శించారు.

English Title
Mayawati gives big shock to Congress

MORE FROM AUTHOR

RELATED ARTICLES