బిగ్ బ్రేకింగ్ : ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టుల హెచ్చరిక.. తీరు మారకుంటే..

Submitted by nanireddy on Wed, 10/10/2018 - 07:57
maoists-warns-mla-giddi-eswari

అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పై మావోయిస్టుల దుశ్చర్య మరిచిపోకముందే.. మరో హెచ్చరిక కలకలం రేపుతోంది.. టీడీపీ నాయకురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని మావోయిస్టులు తీవ్రంగా ఓ హెచ్చరిస్తూ లేఖ రాశారు. అందులో గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి తొత్తుగా మారారని, 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి టీడీపీలో చేరినట్టు అందులో పేర్కొన్నారు మావోలు.అంతేకాదు  తమకు నీతులు చెపుతారా అని ప్రశ్నించారు. ప్రజా కోర్టు సందర్భంగా ఈశ్వరి గురించి కిడారి చెప్పారని.. ఆమెకు అందిన నగదుని 2 నెలల్లోల గిరిజనులకు పంచేసి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కిడారి సర్వేశ్వరావు, సివేరి సోమలకు పట్టిన గతే పడుతుందని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో గూడ క్వారీని వదిలేయాలని చాలాసార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హెచ్చరించమని అయినా వారు పట్టించుకోలేదని గుర్తు చేశారు. అలాగే బాక్సైట్‌ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని.. అందుకే ప్రజాకోర్టులో శిక్షించామని మావోయిస్టులు అన్నారు. దీంతో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పొలిసు భద్రతను పెంచింది ప్రభుత్వం.  

English Title
maoists-warns-mla-giddi-eswari

MORE FROM AUTHOR

RELATED ARTICLES