మావోల హిట్‌లిస్టులో ఉన్న సర్వేశ్వరరావు...గతంలో పలుసార్లు....

Submitted by arun on Mon, 09/24/2018 - 10:29
 kidari sarveswar rao

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును దారుణంగా కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కూడా మృతి చెందారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.  

అరకు లోయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు మృతి చెందారు. ఆయన పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఈ దారుణం జరిగింది.

ఆదివారం ఉదయం 11గంటల వరకూ అరకులోనే ఉన్న కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి లిపిట్టిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలపై వారు ఎమ్మెల్యేను గంటసేపు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే మావోలకు కిడారి సర్వేశ్వరరావు గట్టిగానే బదులిచ్చారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బెదింపులకు దిగడం సరికాదని వారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు తుపాకుల ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అరకు ఘటనపై విచారణకు ఆదేశించినట్టు హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. 

మావోయిస్టులు హిట్‌ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిడారి తర్వాత టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపడంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తానికి విశాఖలో ఏజెన్సీలో కాల్పులు మోతతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 

English Title
maoists killed kidari sarveswar rao

MORE FROM AUTHOR

RELATED ARTICLES