తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేస్తున్నా

x
Highlights

మంత్రి పదవికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేయాల్సి వస్తోందని పైడికొండల మాణిక్యాలరావు అసెంబ్లీలో అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చూసి చాలా...

మంత్రి పదవికి తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేయాల్సి వస్తోందని పైడికొండల మాణిక్యాలరావు అసెంబ్లీలో అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చూసి చాలా నేర్చుకున్నానని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన ఆయన సెల్‌ఫోన్‌ను కేవలం మాట్లాడటానికి, మెసేజ్‌లు చూడటానికి మాత్రమే వాడేవాడినన్నారు. చంద్రబాబును చూసిన తర్వాత కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడంతో పాటు టెక్నాలజీలో చాలా విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన శాఖలో ఏనాడూ జోక్యం చేసుకోలేదన్నారు.

తాడేపల్లిగూడెంలో తన గెలుపునకు తెదేపా శ్రేణులు ఎంతో కృషి చేశాయన్నారు. రాష్ట్రం విడిపోయినందుకు బాధగా ఉన్నా.. ఆ తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూస్తే మాత్రం సంతోషం కలుగుతోందన్నారు. విశాఖ ఆర్థిక రాజధానిగా మారడం, చిన్న పట్టణమైన తాడేపల్లిగూడెంలో నిట్‌ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇవన్నీ రాష్ట్రం విడిపోయినందువల్లే జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు లాంటి సమర్థుడైన ముఖ్యమంత్రి కింద పనిచేయడం గర్వంగా ఉందన్నారు. టెక్నాలజీ విషయంలో ఆయనే తనకు స్ఫూర్తి అని అన్నారు. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు పోరాడిన ఏకైక నాయకుడు వెంకయ్యనాయుడని... అలాంటి నేతని ఇప్పుడు ద్రోహిగా చిత్రీకరించడం బాధగా ఉందన్నారు. ప్రధాని మోదీ చొరవతోనే పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో చేరాయని.. ఈ అంశంలో తెలంగాణలో పార్టీకి నష్టం చేకూరినా ధైర్యంగా ముందడుగు వేశారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories