మంచు పల్లకి సినిమా..మంచి సినిమా

Submitted by arun on Wed, 10/31/2018 - 14:05
Manchu Pallaki Telugu Movie

మంచుపల్లకీ సినిమా. యువకులలో ఉత్సాహం నింపే ఆనాటి సినిమా. ఇది  చిరంజీవితో యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా మొట్టమొదటి సినిమా. సినిమా కథ ఐదుగురు మిత్రుల (చిరంజీవి, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, గిరీష్)చుట్టూ తిరుగుంది. ఈ ఐదుగురూ నిరుద్యోగులు. వీరు ఉంటున్న వీధిలోకి కొత్తగా వస్తుంది సుహాసిని. ఆమె మంచితనాన్ని చూసి చిరంజీవి ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. సుహాసిని ఈ ఐదుగురు మిత్రులను విజయం సాధించేలా ప్రోత్సహిస్తుంది. సుహాసినిని వివాహం చేసుకోవాలనుకొన్న చిరంజీవి ఆమెకు క్యాన్సర్ అనీ, ఎంతోకాలం బతకదనీ తెలుసుకొంటాడు. ఒక వైపు వరకట్నం సమస్యతో నారాయణ రావు చెల్లెలు పెళ్ళి చెడిపోతుంది. చివరకు సుహాసిని కోరిక మేరకు చిరంజీవి మిత్రుడి చెల్లెల్ని వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి-సుహాసిని కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. వీలైతే తప్పక చూడండి. శ్రీ.కో

English Title
Manchu Pallaki Telugu Movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES