విడాకులపై మంచు మనోజ్‌ స్పందన

Submitted by arun on Sat, 06/09/2018 - 11:27
manchu

మంచు మనోజ్ విడాకులు తీసుకోబోతున్నారు.. ఆమె భార్య ప్రణతితో బోలెడు గొడవలంట.. క్రిష్ లాగే ఈయన కూడా భార్య నుండి విడిపోతున్నారట.. అంటూ సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఈవార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవి పనికి మాలిన రూమర్స్ మాత్రమే నేను నా భార్యతో హ్యాపీగా ఉన్నా అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టారు మంచు మనోజ్. 

విడాకులు తీసుకున్నట్టు వస్తున్న వార్తలు నిజాలు కావని స్పష్టం చేశాడు. ఇదే విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ స్పందిస్తూ.. ‘వాళ్ల బొంద. రూమర్స్ పుట్టించేవాళ్లకు ఏం తెలుసు మా గురించి’ అని ఖండించారు. అంతే కాకుండా ‘ 2010 నుండి ప్ర‌ణ‌తి నా జీవితంలో అడుగు పెట్టింది.. నా గుండె ఆగిపోయేంతవరకు తనే నా దేవ‌త అంటూ’ బదులిచ్చాడు. మరి ఇప్పటికైనా మనోజ్, ప్రణతిల విడాకుల రూమర్స్‌‌కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.

English Title
Manchu Manoj Divorce Gets a Clarity

MORE FROM AUTHOR

RELATED ARTICLES