దారుణం: నడిరోడ్డపై భార్యను నరికిన భర్త

Submitted by arun on Fri, 07/06/2018 - 13:59
 murder attempt

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం భార్యకు తోడుండాల్సిన భర్త... ఆమెను అత్యంత పాశవికంగా అంతమొందించాడు. ఈ ఘటన దిండిగల్ జిల్లా రాజపాలెంలో చోటు చేసుకుంది. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డుపై తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో నరికి చంపాడు. వెంటనే కొందరు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో, మదీశ్వరన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.  మదీశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరిణించింది. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్‌లో జరిగిన ఈ దారుణం సీసీ ఫుటేజీలో రికార్డవడం ద్వారా వెలుగులోకి వచ్చింది.

English Title
Man tries to hack wife in broad daylight in Tamil Nadu

MORE FROM AUTHOR

RELATED ARTICLES