ప్రేమకు అడ్డుపడుతున్నారని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Submitted by nanireddy on Sun, 06/10/2018 - 09:28
man suicide over love problems

తన ప్రేమకు ప్రియురాలు తరుపు బంధువులు అడ్డుపడుతున్నారని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా  వడ్డేపల్లి రైల్వే  స్టేషన్ లో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా  హసన్‌పర్తి మండలం దేవన్నపేటకు చెందిన ఆడెపు సృజన్‌ (20)  పాలిటెక్నిక్‌ కళాశాలలో  ఫైనలియర్‌ చదువుతున్నాడు. అతడు కొంతకాలంగా అదే కాలేజీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ విషయమై అమ్మాయి తరుపు  బంధువులు అతన్ని బెదిరిస్తున్నారు. ఆమె వెంట పడొద్దని హెచ్చరించారు. దీంతో మనస్థాపం చెందిన సృజన్ వడ్డేపల్లి రైల్వే ట్రాక్‌వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సృజన్ సూసైడ్ లెటర్ రాశాడు. అందులో..  'మా ప్రేమకు ప్రియురాలి బంధువులు అడ్డుతగులుతున్నాడని అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు' రాసి ఉంది కాగా ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

English Title
man suicide over love problems

MORE FROM AUTHOR

RELATED ARTICLES