గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త టెక్నిక్ ...బంగారాన్ని పేస్ట్‌గా మార్చి..

గోల్డ్ స్మగ్లింగ్‌లో కొత్త టెక్నిక్ ...బంగారాన్ని పేస్ట్‌గా మార్చి..
x
Highlights

గోల్డ్ స్మగ్లర్లు కొత్త దార్లు వెతుకుంటున్నాటున్నారు. బంగారాన్ని తరలించేందుకు కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. గతంలో గోళ్లు, శరీర భాగంలో బంగారం...

గోల్డ్ స్మగ్లర్లు కొత్త దార్లు వెతుకుంటున్నాటున్నారు. బంగారాన్ని తరలించేందుకు కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. గతంలో గోళ్లు, శరీర భాగంలో బంగారం దాచుకుని అక్రమ రవాణా చేశారు. ఇప్పుడు పేస్ట్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. ఈ నయా మోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బయటపడింది.

బంగారం స్మగ్లింగ్ లో కొత్త టెక్నిక్...స్కానింగ్ మిషిన్లు కనిపెట్టకుండా అక్రమ రవాణా ...పేస్ట్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్...పేస్ట్ కాల్చి గుట్టు రట్టు చేసిన షంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణీకులతో సందడిగా ఉంది. ప్యాసింజర్లను డీఆర్ ఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కొలంబో నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద కిలో పన్నెండు గ్రాముల పేస్ట్ లభించింది. ఈ పేస్ట్ గురించి ప్రశ్నిస్తే పొంతనలేని జవాబులు ఇచ్చాడు. ఈ పేస్ట్ పై అధికారులకు అనుమానం వచ్చింది. స్కానింగ్ చేస్తే పేస్ట్ మాత్రమే కనిపించింది. తర్వాత ఓ పాత్రలో పేస్ట్ ఉంచి, దానిపై కిరోసిన్ పోసి మంట పెట్టారు. మంట పెట్టిన కాసేపటికి పాత్రలోని పేస్ట్ ముద్దలు ముద్దలుగా, పోడిగా మారింది. పోడిపై మరింత దగ్గరగా మంట పెట్టారు. బంగారం వలే పోడి జిగేల్ మంటోంది.

పాత్రలో నుంచి కొద్ది పోడిని తీసుకుని పెంకుపై వేసి కాల్చారు. కాసేపటికి పోడి కాస్తా బంగారం ముద్దవలే మారిపోయింది. ముద్దను స్పూన్ తో కట్ చేసి పరిశీలిస్తే అది బంగారం అని తేలింది. పేస్టే కాస్తా బంగారంగా మారడంతో డీఆర్ ఐ అధికారులు షాక్ తిన్నారు. కొలంబో నుంచి వచ్చిన గోల్డ్ స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు. బంగారం పేస్ట్ చేయడానికి వాడుతున్నపదార్థం ఏంటి, ఎప్పటి నుంచి ఈ దందా చేస్తున్నాడు అనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories