ప్రియురాలిని చంపి ప్రియుడి ఆత్మహత్య

Submitted by nanireddy on Tue, 11/27/2018 - 08:35
man kills lover and after he dies in new delhi

ప్రియురాలితో గొడవపడి ఆమెను హత్యచేసి ఆపై తాను ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఛత్రాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్ కు చెందిన 23 ఏళ్ల యువతి ఢిల్లీలోడిజైనర్ గా పనిచేసేది. ఆమెకు 26 ఏళ్ల అవిషేక్ మండల్ అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. వారిద్దరూ కొన్ని రోజుల కిందట ప్రేమలో పడ్డారు. అయితే తరచూ వీరిమధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ఈ క్రమంలో అవిషేక్ ప్రియురాలితో గొడవపడ్డాడు.. దాంతో  అదికాస్తా హత్యకు దారితీసింది. ప్రియురాలిని గొంతు కోసి చంపేసి, ఆపై తాను ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వీరి మధ్య ఘర్షణకు కారణం ఆ యువకుడు మరో యువతితో స్నేహంగా ఉండటమేనని పోలీసులు భావిస్తున్నారు. 

English Title
man kills lover and after he dies in new delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES