విమానం ఢీకొని వ్యక్తి మృతి

విమానం ఢీకొని వ్యక్తి మృతి
x
Highlights

రష్యాలో విమానం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. విమానం గాల్లో ఎగురుతుంది కధా.. మనిషిని ఎలా ఢీకొంటుంది అనే డౌట్ రావొచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది...

రష్యాలో విమానం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. విమానం గాల్లో ఎగురుతుంది కధా.. మనిషిని ఎలా ఢీకొంటుంది అనే డౌట్ రావొచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. రష్యాలోని మాస్కోలో బోయింగ్‌ 737 విమానం ఏథెన్స్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌ అవుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి రన్‌వేపైకి రావడంతో విమానం ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్నీ ఎయిర్పోర్టు పోలీసులు దృవీకరించారు. మరణించిన వ్యక్తిని ఆర్మేనియాకు చెందిన ఆల్బర్ట్‌ ఎప్రెమ్‌యాన్‌ (25)గా గుర్తించామని. స్పెయిన్‌ నుంచి వస్తున్న ఆయన మాస్కోలో విమానం మారి ఆర్మేనియాకు వెళ్లాలి. అయితే.. స్పెయిన్‌ నుంచి వస్తున్న సమయంలో విమానంలోని సిబ్బందిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. దాంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం ఆర్మేనియా విమానం ఎక్కించేందుకు తీసుకెళ్తుండగా.. ఉన్నట్టుండి రన్‌వేపైకి పరుగెత్తాడు. ఆ సమయంలో ఏథెన్స్‌కు వెళ్లే విమానం టేకాఫ్‌ అవుతూ ఆల్బర్ట్‌ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడని ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories