హెల్మెట్ ఏదీ?.. అంటూ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తికి రూ.2 వేల జరిమానా విధించిన పోలీసులు!

Submitted by arun on Mon, 10/08/2018 - 12:40
police

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. అది లేకుండా బండెక్కితే భారీ జరిమానా తప్పదు. అయితే, ఈ నిబంధన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే కాదు.. సైకిలిస్టులకూ వర్తిస్తుంటూ ఓ వ్యక్తికి ఏకంగా రూ.2 వేల జరిమానా విధించారు కేరళ పోలీసులు. అంతమొత్తం తన దగ్గర లేదని ఆ అభాగ్యుడు మొరపెట్టుకోవడంతో కనికరించిన పోలీసులు చివరికి రూ.500 కట్టించుకున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిల్‌పై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా  వాహనాన్ని వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. తన దగ్గర అంత డబ్బులు లేవని పోలీసులను ఖాసీం వేడుకున్నాడు. అయినా వినలేదు. చివరికి రూ. 500 కట్టాలని చెప్పారు. అంతేకాకుండా తన సైకిల్ టైర్లలోని గాలిని కూడా తొలగించారు. చేసేదేమీలేక అతను రూ. 500 కట్టేశాడు.

ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అదికాస్తా వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు. పోలీసుల పనితీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Tags
English Title
Man fined for overspeeding his ‘bicycle’ by highway police in Kerala

MORE FROM AUTHOR

RELATED ARTICLES