భర్త ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన భార్యలు

Submitted by arun on Wed, 04/11/2018 - 17:14
Wife protests

నిజామాబాద్‌లో ఓ నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరిని.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో పెళ్లికి ఈ నిత్య పెళ్లికొడుకు సిద్ధం కావడంతో విషయం బయటపడింది. దీంతో న్యాయం కోసం నిత్య పెళ్లికొడుకు ఇంటి ఎదుట ఆయన భార్యలు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

నిజామాబాద్‌లోని రాజీవ్‌ నగర్‌లో నిత్య పెళ్లికొడుకు ఇంటి ఎదుట ఆయన భార్యలు రెండురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఐద్వా సహకారంతో మొదటి భార్య ఐలాబాయి, రెండో భార్య దీప భర్త ఇంటి ముందు బైఠాయించి, రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

భార్యల ఆందోళనతో ఆ నిత్య పెళ్లికొడుకు పరారయ్యాడు. పవన్‌కుమార్ ఛత్రే పెళ్లిళ్ల భాగోతం మహారాష్ట్ర నుంచి ప్రారంభమైంది. 2010లో మహారాష్ట్రలోని టెంబర్ ప్రాంతానికి చెందిన ఐలాబాయితో ముందు పెళ్లి జరిగింది. ఆ తర్వాత మొదటి భార్య ఉండగానే..2015లో నిర్మల్ జిల్లా గొల్లమాడకు చెందిన దీపను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ ఉండగానే..2017లో విజయవాడకు చెందిన రాణిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురినీ ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడీ నిత్యపెళ్లికొడుకు. 

తాజాగా కేరళకు చెందిన యువతితో నాలుగో పెళ్లికి సిద్ధమైన విషయం తెలుసుకున్న ఇద్దరు భార్యలు ఆందోళనకు దిగారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న పవన్‌కుమార్‌ను ఛత్రేను కఠినంగా శిక్షించాలని ఆయన భార్యలతోపాటు మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. భర్త చేతిలో మోసపోయిన భార్యలు భర్త ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు. 

English Title
man escaped after three marriages

MORE FROM AUTHOR

RELATED ARTICLES