భార్య స్నానం చేయడం లేదని భర్త విడాకులు

Submitted by arun on Fri, 01/12/2018 - 14:35
bath

తన భార్య ఏడాదికాలంగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు ఇచ్చిన ఘటన తైవాన్ దేశంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్య ఏడాదికాలంగా అసలు స్నానం చేయడం లేదని...వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. బాధితుడు కోర్టు ముందుంచిన అంశాలను చూస్తే... ‘‘ప్రేమించుకునే సమయంలో నా ప్రియురాలు వారానికోసారి స్నానం చేసేది. పెళ్లయిన తర్వాత ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తోంది. అది కూడా ఆరు గంటల సమయం తీసుకుంటోంది. రోజూ ఉదయం పళ్లను శుభ్రం చేసుకునే అలవాటు కూడా లేదు. ఉద్యోగం చేయవద్దంటూ పోరు పెడుతోంది. దాంతో ఉద్యోగం మానేసి మరో ప్రాంతానికి వెళ్లగా, వెతుక్కుంటూ అక్కడకు కూడా వచ్చి మరీ వేధిస్తోంది. ఆమెతో నేను కాపురం చేయలేను’’ అంటూ విడాకులు కోరుతున్న వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
 

English Title
Man divorces wife for her reluctance to take a shower; it was preventing them from starting a family

MORE FROM AUTHOR

RELATED ARTICLES