సీన్ రివర్స్.. కుక్కను కరిచిన మనిషి

Submitted by arun on Wed, 07/04/2018 - 12:54
Man Bites Dog

కుక్కలు మనిషిని కురుస్తుండటం మామూలే. కానీ మనిషే కుక్కను కరిచాడు.. అందుకే ఇది వార్తయింది. ఓ యువకుడు తానుపెంచుకుంటున్న కుక్కను అత్యంత దారుణంగా కొరికాడు. ఈ సంఘటన లండన్‌లోని నార్త్ షీల్డ్ నగరంలో చోటుచేసుకుంది. నార్త్ షీల్డు నగరానికి చెందిన టేలర్ లావేరిక్ అనే 20 ఏళ్ల యువకుడు 8 నెలల వయసుగల ఓ కుక్కకు ‘డీజిల్’ అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. తన పెంపుడు కుక్క నచ్చలేదనే కోపంతో టేలర్ లావేరిక్ అనే యువకుడు ‘డీజిల్’ ముఖం, కళ్లు, చెవులు, ముక్కుపై అత్యంత క్రూరంగా కొరికాడు. దీంతో డీజిల్ అనే జాగిలం తీవ్రంగా గాయపడింది. టేలర్ కొరకడం వల్ల కుక్కకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా పెంపుడు కుక్క యజమాని అయిన టేలర్ లావేరిక్ కొరికాడని తేలింది. దీంతో పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టగా తన పెంపుడు కుక్క మంచిది కాదని అందుకే కొరికానని టేలర్ కోర్టులో వెల్లడించడంతో జడ్జీనే షాక్ కు గురయ్యాడు. కుక్కను చికిత్స కోసం పశువైద్యశాలకు తరలించి, కుక్కను కొరికిన టేలర్ లావేరిక్ కు 750 డాలర్ల జరిమానా విధించడంతోపాటు అతను పదేళ్ల పాటు జంతువులు పెంచుకోకుండా నిషేధం విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తంమీద కుక్కను కరచిన యువకుడి ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది.

English Title
Man Bites Dog

MORE FROM AUTHOR

RELATED ARTICLES