కర్నూలు జిల్లాలో మరో మనోహరాచారి...ప్రేమలో పడిందని కూతురిపై...

Submitted by arun on Sat, 10/06/2018 - 10:48
Kurnool

పరువు ముందు ప్రేమ మరోసారి ఓడిపోయింది. మొన్న మిర్యాలగూడ, నిన్న ఎర్రగడ్డ ఇవాళ ఆదోని. ప్రేమించిన పాపానికి ఆడబిడ్డలు బలైపోతున్నారు. కన్నకూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న తండ్రి ఆమెపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. కసిదీరా కత్తితో గొంతు కోశాడు. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కలకలం రేపుతోంది. 

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిపై కత్తితో దాడి చేశాడో కర్కశ తండ్రి. కసిదీరా కడుపులో, గొంతులో పొడిచాడు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏడుసార్లు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. శంకర్ నగర్‌కు చెందిన జాన్ అనే వ్యక్తి.. పనీపాట లేకుండా ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో తన కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్నాడు. అంతే అప్పటి నుంచి అమ్మాయిపై అనుమానం పెంచుకున్నాడు. దీనిపై ఇంట్లో చాలాకాలంగా గొడవ కూడా జరుగుతోంది. ప్రేమించిన యువకుడిని మర్చిపోవాలంటూ కూతరును చాలాసార్లు హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో శుక్రవారం తప్పతాగిన వచ్చిన శంకర్ ఎప్పట్లాగే కూతురితో గొడవ పెట్టుకున్నాడు. కోపంతో రెచ్చిపోయిన జాన్‌ కూతురిని బయటకు లాక్కొచ్చి కత్తితో డాడి చేశాడు. కడుపు, గొంతుపై ఇష్టానుసారం పొడిచాడు. ఏడుకత్తిపోట్లకు గురైన అమ్మాయి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తండ్రి చేతిలో తీవ్రంగా గాయపడ్డ అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిట్టితల్లి చావుబతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యులు తెలిపారు. 

Tags
English Title
Man Assaulted his Daughter in Kurnool

MORE FROM AUTHOR

RELATED ARTICLES