మల్లెమాల..తెల్ల మల్లెలాంటి మనస్సు

Submitted by arun on Sat, 12/01/2018 - 12:28
Mallemala Sundara Rami Reddy

మల్లెమాల అనే పేరు...ఇప్పుడు వినగానే చాలామందికి జబర్ధస్ట్ ప్రోగ్రాం గుర్తుకు రావచ్చు. అయితే ఇది ఎవరి పేరో తెలుసా మీకు! మల్లెమాల ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి . ఆయన ఇంటిపేరు ‘మల్లెమాల’ను కలం పేరుగా మార్చుకొని దాదాపు 5,000 వేలకు పైగా కవితలు, సినీ గేయాలు రచించి "సహజ కవి"గా ప్రశంసలందుకున్నారు. వీరు రచించిన 'మల్లెమాల రామాయణం' ఒక విశిష్టమైన స్థాయిలో నిలిపింది. వీరు రచించిన స్వీయచరిత్ర "ఇది నా కథ" ఎందరో సినీ ప్రముఖులని విమర్శించిన నిర్మొహమాటపు రచనగా పేర్కొనవచ్చును. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన స్వగృహంలో 2011, డిసెంబర్ 11 న కన్నుమూశారు. ఆయన తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా చిత్రనిర్మాత.శ్రీ.కో.

English Title
Mallemala Sundara Rami Reddy, popularly known as M. S. Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES