ప్రముఖ నటుడి మృతి.. విషాదంలో సినీ ఇండస్ట్రీ!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 12:49
malayalam actor kalasala-babu-dead

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో తీరని శోకం మిగులుతోంది. మొన్నటికి మొన్న అమృతం ఆంజనేయులు మృతిచెందడంతో ఆ సీరియల్ అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. తాజాగా మళయాళ నటుడు  అనువాద తెలుగు సీరియల్ యాక్టర్ కళాశాల బాబు(68) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలంలోని తన స్వగృహంలో తుది శ్వాసవిడిచారు. దాదాపు 50 కి పైగా చిత్రాల్లో నటించిన కళాశాల  బాబు ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు పలు బుల్లితెర సీరియల్ లలో కళాశాల బాబు నటించారు. కాగా అయన తల్లిదండ్రులు క్రిష్ణన్ నాయర్ , కల్యాణికుట్టి.. వీరు ప్రసిద్ధ కథాకలి మాస్ట్రో కళామండలం , మోహినీ ఆట్టం లలో నిష్ణాతులు. ఇక కళాశాల బాబు మృతిపట్ల సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు నటులు అయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 
 

English Title
malayalam actor kalasala-babu-dead

MORE FROM AUTHOR

RELATED ARTICLES