భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Submitted by arun on Mon, 03/12/2018 - 10:40
ips

చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 38మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఐజీ స్థాయి నుంచి అదనపు డీజీల వరకూ స్థానచలనం కలిగించింది. ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని అడిషనల్‌ ఎస్పీ స్థాయిలో ఉన్న ఐపీఎస్‌లతో కలిపి మొత్తం 38మందికి పోస్టింగులు ఇచ్చింది ప్రభుత్వం. ఇక 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌ను హైదరాబాద్‌ పోలీస్‌‌ కమిషనర్‌గా నియమించింది. ఇక సైబరాబాద్ సీపీగా స్వాతి లక్రా పేరు వినిపించినప్పటికీ వీసీ సజ్జనర్‌‌ను ఆ పోస్టులో అపాయింట్‌ చేశారు. 

ips2

ips3

English Title
major reshuffle telangana govt transfers 38 ips

MORE FROM AUTHOR

RELATED ARTICLES