పెళ్లికూతురికి మహేష్ సర్‌ఫ్రైజ్ గిఫ్ట్!

Submitted by nanireddy on Sat, 05/05/2018 - 11:01
mahesh-sends-surprise-gift-to-his-fangir

టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుకు ఆడ మగ అనే తేడా లేకుండా అభిమానులు భారీగానే ఉన్నారన్న సంగతి తెలిసందే. అందులో లేడీ ఫ్యాన్స్ అయితే మహేష్ అంటే మరి ఎక్కువగా ఇష్టపడేవారు. అలా సులేఖ అనే యువతికి కూడా మహేష్ అంటే చాల ఇష్టం ఆమెకే కాదు మహేష్ అంటే ఆమె కుటుంబసభ్యులకు కూడా ఇష్టమే. ఇటీవల సులేఖ వివాహం జరిగింది. ఆ సందర్బంగా ఆమెకు మహేష్ చేత సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇప్పించాలనుకున్నారు. దాంతో మీ అభిమాని పెళ్ళికి రావలసిందిగా మహేష్ ను అభ్యర్ధించారు. వారి అభిమానానికి ఫిదా అయిన మహేష్, ఆయన భార్య నమ్రతలు పెళ్ళికి రాకుండా.. అభిమాని మహేశ్ తన సైన్‌తోపాటు నమ్రతా సంతకం చేసిన పర్సనల్ గ్రీటింగ్‌ను సులేఖకి పంపించాడు. పెళ్ళిలో కుటుంబసభ్యులు ఈ గ్రీటింగును సులేఖకు అందించగా ఆమె ఎగిరి గంతేసింది. సాక్షాత్తు అభిమాన నటుడి విషెష్ ను అందరికి చూపిస్తూ అందంలో మునిగిపోయింది. దీన్ని జీవితాంతం పదిలంగా దాచుకుంటానంటోంది. 

English Title
mahesh-sends-surprise-gift-to-his-fangir

MORE FROM AUTHOR

RELATED ARTICLES