ఒకేతాటిపై : పార్టీ చేసుకున్న పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్

Submitted by lakshman on Sat, 01/20/2018 - 00:11
 kathi mahesh_pawankalyan fans


ప‌వ‌న్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ ల వివాదం స‌మిసిన‌ట్లే తెలుస్తోంది. గ‌త కొద్దికాలంగా క‌త్తి మ‌హేష్ - ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకున్న విష‌యం తెలిసింది. అయితే గురువారం రాత్రి క‌త్తి మ‌హేష్  ఓ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూకి వెళుతుండ‌గా మాదాపూర్ ట‌వ‌ర్స్ నుండి శిల్పారామం మ‌ధ్య‌లో త‌న కారును అడ్డ‌గించి కోడిగుడ్ల‌తో దాడి చేశారు. ఈ దాడిపై క‌త్తిమ‌హేష్ మాదాపూర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. 
అంతేకాదు త‌న‌పై దాడికి పాల్ప‌డింది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్సేన‌ని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయాల‌ని కోరాడు. 
ఇదిలా ఉంటే శుక్ర‌వారం మ‌రో లైవ్ డిబెట్లో పాల్గొన్న క‌త్తిమ‌హేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పవ‌న్ అఫైర్లు అన్నీ త‌న‌కు తెలుసున‌ని ప‌లు ప్ర‌శ్న‌లు సంధించాడు.
కాగా క‌త్తిమ‌హేష్ త‌న‌పై దాడికి పాల్ప‌డినందుకు మాదాపూర్ పీఎస్ లో పెట్టిన కేసును వెన‌క్కి తీసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా  పవన్ అభిమానుల్లా కాకుండా జనసేన కార్యకర్తలుగా పనిచేయాలని సూచించారు. ఇకపై పవన్ అభిమానులు రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసినా తాను సంయమనం పాటిస్తానని చెప్పాడు. అనంత‌రం జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త దిలీప్ క‌ల్యాణ్ సుంక‌ర‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి పార్టీ చేసుకున్న ఫోటోలు ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

English Title
Mahesh Kathi Step Back from Pawan Kalyan Issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES