పందితో పోల్చడంపై కత్తి మహేశ్ ఏమన్నాడంటే...

Submitted by arun on Fri, 01/05/2018 - 13:42

పవన్ ఫ్యాన్స్‌పై విరుచుకుపడుతున్న కత్తి మహేశ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అతనిని విమర్శిస్తూ పేజ్‌లు, ఫొటోలు సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి. పందితో కత్తి మహేశ్‌ను పోల్చుతూ మెమ్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్‌బుక్‌ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్‌ ఆఫీసులోనే క్రియేట్‌ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్‌ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి. తిట్టమని కోరుతూ పవన్‌ అభిమానులకు నా ఫోన్‌ నంబర్‌ షేర్‌ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే! నిజానికి అల్లు అరవింద్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. వికృతపర్వాల సంగతి ఆయనకు తెలిసి ఉంటే గనుక అలాంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని కత్తి మహేశ్‌ రాసుకొచ్చారు.

English Title
mahesh kathi sensational comments allu aravind

MORE FROM AUTHOR

RELATED ARTICLES