మహేశ్ బాబు స్పైడర్ సినిమా ట్రైలర్ విడుదల

Submitted by lakshman on Fri, 09/15/2017 - 15:52

మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 2మిలియన్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిభరితంగా సాగింది. మురుగదాస్ మేకింగ్, మహేశ్ బాబు యాక్టింగ్‌ కలిస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగింది. ఈ ట్రైలర్‌లో విలన్‌కు, హీరోకు మధ్య వచ్చే సీన్స్, విలన్ సృష్టించే విధ్వంసం, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సంభాషణలను కనిపిస్తాయి. పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శికి మంచి పాత్ర లభించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలిసిపోతుంది. మొత్తం మీద తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో.. సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.

స్పైడర్ ట్రైలర్ కోసం క్లిక్ చేయండి 

 

ఇదిలా ఉంటే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌లో ఒక తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తమిళ భాషలో ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్న ప్రేమిస్తే భరత్‌ షాట్‌ను ఉంచారు. తెలుగు ట్రైలర్‌‌లో భరత్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు స్పైడర్‌లో భరత్ ఉన్నాడా, లేడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఈ సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మహేశ్, నమ్రతా పిల్లలతో కలిసి రానున్నట్లు సమాచారం. మురుగదాస్, రకుల్, చిత్ర నిర్మాతలతో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఆడియో వేడుకను చెన్నైలో నిర్వహించిన స్పైడర్ టీం మహేశ్ అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఈ వేడుకను నిర్వహిస్తోంది. 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది.

English Title
Mahesh babu's spder trailer is out

MORE FROM AUTHOR

RELATED ARTICLES