ఎట్టకేలకు ధైర్యం చేసిన మహేష్ బాబు

Submitted by arun on Wed, 01/17/2018 - 13:06
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సంక్రాంతికి నిరాశ తప్పలేదు. భరత్ అనే నేను సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాడని ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ తీరా చూస్తే...లుక్ రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ ఆశలన్నీఆవిరైయ్యాయి. ఐతే మ‌హేష్ త్వరలోనే ఫ్యాన్స్ లో జోష్ నింపబోతున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ చేసి..డేట్ అనౌన్స్ చేశాడు.

మహేష్ బాబు సినిమా అంటే షూటింగ్ స్టార్టైన నుంచే బోలెడన్నీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటాయి. వాటితో పాటు అదే రేంజ్ లో ఎదురుచూపులు మొదలవుతాయి. ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ వస్తుందా..మహేష్ లుక్ ఎలా ఉంటుందాని ఆశపడుతుంటారు ఫ్యాన్స్. మరి అలాంటిది శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే..ఇంకెంత ఈగర్ గా వెయిట్ చేయాలి. భరత్ అనే మూవీపై ఇప్పుడు అలాంటి ఎదులుచూపులే నెలకొన్నాయి. మహేష్ లుక్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు.

భరత్ అనే నేను మూవీ ఫస్ట్ పై కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. మొదట న్యూఇయర్ కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చేయలేదు. ఫైనల్ గా సంక్రాంతికి ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్. తీరా చూస్తే..ఫస్ట్ లుక్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ కొంత నిరాశకు గురైయ్యారు. అయితే ఫ్యాన్స్ ఎదురుచూపులకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా..ఈనెల 26న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నాడు.

భరత్ అనే నేను మూవీ ఫస్ట్ లుక్ ఇంత వరకు రిలీజ్ చేయకపోవడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు..ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. సినిమాపై హైప్ క్రియేట్ చేయగలగాలి. అంతేకానీ ఆదరబాధరగా రిలీజ్ చేసి బొక్కబోర్ల పడకూడదనే తొందరపడేలేదు. అందుకే ఫస్ట్ లుక్ కు లేట్ ఐంది. అలాగే సినిమాపై ఉన్నఒత్తిడీ వల్ల కూడా ఫస్ట్ లుక్ లేట్ అయిందని చెప్పొచ్చు. మహేష్ కు వరుసగా రెండు ఫ్లాప్ పడడంతో భరత్ అనే నేను చాలా కీలకంగా మారింది. ఆ ప్రెషర్ కారణంగానే ఫస్ట్ లుక్ రిలీజ్ కు కాస్త వెనకడుగు వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు భరత్ అనే సినిమాపై ఎంత భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయో. అదే స్థాయిలో మూవీపై ఒత్తిడి కూడా ఉంది. మహేష్ కు హ్యట్రిక్ ఫ్లాప్ ఇవ్వాలన్నా..ఫ్లాప్ ల నుంచి గట్టెక్కించాలన్నా భరత్ అనే నేను మూవీతో తేలిపోతోంది. అలాగే దర్శకుడు కొరటాల శివ టాప్ డైరెక్టర్ గా ప్లేస్ సంపాదించుకోవాలంటే ఈ మూవీతో నిరూపించుకోకతప్పదు. హీరోయిన్ కైరా అద్వాణీకి తెలుగులో ఇది తొలి సినిమా కావడంతో..అమ్మడు ఫ్యూచర్ ఈ మూవీతో తెలిపోనుంది. మరి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ కాంబో ఈమూవీతో ఏం చేస్తోడో చూడాలి.

English Title
Mahesh Babu’s Bharat Ane Nenu’s first look to be out on Republic Day

MORE FROM AUTHOR

RELATED ARTICLES