మ‌హేష్ ను ఇంప్రెస్ చేసిన నేహా

Submitted by arun on Mon, 02/05/2018 - 11:49
Mahesh Babu

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూత్‌, మ‌హిళ‌ల‌తో పాటు చిన్నారులు కూడా మ‌హేష్‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా యూఎస్‌కి చెందిన మ‌హేష్ ఫ్యాన్ నేహా అనే చిన్నారి మ‌హేష్‌కి లెట‌ర్ రాసి అత‌నిని ఇంప్రెస్ చేసింది.ఆరో తరగతి చదువుతున్న నేహా సనంపుడిని, స్కూల్‌ యాజమాన్యం మీ అభిమాన సెలబ్రిటీకి లేఖ రాయమని చెప్పారు. వారి ఆదేశాల మేరకు నేహా, తనకు ఎంతో ఇష్టమైన మహేష్‌బాబుకి లేఖ రాసింది. ఆ లేఖకు ఎంతో ఇంప్రెస్‌ అయిన మహేష్‌ వెంటనే ఓ స్వీట్‌ రిప్లైను కూడా ఇచ్చారు.

 ''నా పేరు నేహా సనంపుడి.  అమెరికాలోని ఈగిల్‌ రిట్జ్‌ స్కూల్‌లో  నేను ఆరో తరగతి చదువుతున్నాను. చెస్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడటం నాకెంతో ఇష్టం. మా స్కూల్‌ వారు మీ అభిమాన సెలబ్రిటీకి లేఖ రాయమని చెప్పారు. ఇందులో భాగంగా నేను మీకు లేఖ రాస్తున్నా.  నేను మీకు చాలా పెద్ద అభిమానిని. మీ ప్రతి సినిమా తప్పక చూస్తాను.  మిమ్మ‌ల్ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకొని చాలా హ్య‌పీగా ఉంటున్నా. మీరు చాలా హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. శ్రీమంతుడు చిత్రం నాకెంతో న‌చ్చింది. సితార‌, గౌత‌మ్‌లు అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీ విలువైన సమయంలో నా లేఖ చదివినందుకు కృతజ్ఞతలు. మీరు బిజీగా ఉంటారని తెలిసినా.. తిరిగి రిప్లై ఇస్తారని భావిస్తున్నా'' అంటూ నేహా, ప్రిన్స్‌ మహేష్‌ బాబుకి లేఖ రాసింది. 

ఈ లేఖ‌ని మ‌హేష్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. డియ‌ర్ నేహా.. ఇంటర్నెట్‌, ఈ-మెయిల్స్ విరివిగా వాడుతోన్న ఈ కాలంలో పోస్టు ద్వారా అందిన నీ లేఖ నన్ను ఆశ్చర్యపరిచింది . నా సిసినిమాల గురించి నువ్వు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నీకు శ్రీమంతుడు ఎంత ఇష్ట‌మో సితార, గౌతమ్‌లకు కూడా ‘శ్రీమంతుడు’ అంటే చాలా ఇష్టమని చెప్పాడు మ‌హేష్ బాబు. నేహా నీ లేఖను చదవడం నిజంగా సంతోషంగా ఉంది. నువ్వు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ ల‌వ్‌, గాడ్ బ్లెస్ అంటూ ఆ చిన్నారిని దీవించాడు మ‌హేష్‌.

English Title
Mahesh Babu receives a pleasant surprise from his young fan in the US

MORE FROM AUTHOR

RELATED ARTICLES