'మహర్షి' టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది

Submitted by arun on Thu, 08/09/2018 - 14:57

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తన 25వ మూవీ మహర్షి  టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ సూపర్ ట్రీట్ ఇచ్చారు. మహేష్.. కాలర్ ఎగరేస్తూ ల్యాప్ టాప్ పట్టుకుని నడిచి వస్తున్న లుక్ కిర్రాక్ అనిపిస్తుంది. ఈ టీజర్ ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 1మిలియన్ డిజిటల్ వ్యూస్ ను క్రాస్ చేసేసింది. దీనిని బట్టి ఈ సినిమా పట్ల అంతా ఎంత ఆసక్తితో ఉన్నారనే విషయం అర్థమవుతోంది. 

మహేశ్ బాబు కెరియర్లో 25వ సినిమాగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతుబిడ్డగాను ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ లుక్ .. టీజర్ అంతా 'మహర్షి' గురించి మాట్లాడుకునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.      

English Title
'Maharshi' first look out

MORE FROM AUTHOR

RELATED ARTICLES