మరాఠాల రిజర్వేషన్లు ..అసెంబ్లీలో బిల్లు పాస్‌

Submitted by chandram on Thu, 11/29/2018 - 15:39
cm

ఎట్టకేలకు మరాఠాలకు తీపి కబురు అందించింది మహారాష్ట్ర సర్కార్. సర్కారు కొలువుల్లో, విద్యారంగంలో తమకు 16శాతం రిజర్వేషన్ కల్పించాలని మరాఠాలు కొరిన విషయం తెలిసిందే. కాగా నేడే మరాఠా కోటా బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో ఇలా ప్రకటించరో లేదో అప్పుడే మూజువాణి ఓటు ద్వారా దానిని పాస్ చేయడం విశేషం. వెంటనే బిల్లును ఎగువ సభకు పంపారు. బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కృతజ్ఞతలు తెలిపారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గత కొన్నాళ్లుగా మహారాష్ట్రలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ధన్‌గర్ సామాజికవర్గానికి చెందిన రిజర్వేషన్ల అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రస్తావించారు. ప్రస్తుతానికి దానిపై ఇంకా నివేదిక రాలేదని, తాము నియమించిన సబ్ కమిటీ అదే పనిలో ఉన్నదని ఆయన పెర్కోన్నారు.


 

English Title
Maharashtra assembly passes bill giving 16% reservation for Marathas

MORE FROM AUTHOR

RELATED ARTICLES