సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేశ్

సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేశ్
x
Highlights

వెండితెరపై మహారాణి.. తెలుగు సినిమా చరిత్రలోనే తనకంటూ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న అత్యంత అరుదైన నటి.. సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా.. టాలీవుడ్‌లో...


వెండితెరపై మహారాణి.. తెలుగు సినిమా చరిత్రలోనే తనకంటూ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న అత్యంత అరుదైన నటి.. సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా.. టాలీవుడ్‌లో వస్తున్న తొలి బయోపిక్‌.. మహానటి. భారీ తారాగణంతో వెండితెరపై ఆమె జీవితాన్ని మరోసారి ఆవిష్కరించారు. ఇవాళ విడుదలైన మహానటి.. సావిత్ర జీవితంలోని కీలక కోణాలను ఆవిష్కరించింది.

టీజర్స్, ఫస్ట్‌లుక్స్‌, ప్రమోషన్స్‌తో.. ప్రేక్షకుల్లో సినిమాపై ఎక్కడా లేని క్యూరియాసిటీ పెంచిన మహానటి మూవీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. సావిత్ర పాత్రలో.. కీర్తిసురేశ్ జీవించింది. తన అభినయంతో సావిత్రిని మైమరిపించింది. మరోసారి మన ముంగిట్లోకి సావిత్రి వచ్చిందా.. అన్నట్లు వెండితెరపై కీర్తిసురేశ్ నటన.. అందరిని మంత్రముగ్దులను చేసింది.

జెమినీ గణేశన్‌గా దుల్కర్ సల్మాన్, అక్కినేని పాత్రలో నాగచైతన్య, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటించారు. ఇటు జర్నలిస్టు మధురవాణి పాత్రలో సమంత, ఫోటోగ్రాఫర్‌ విజయ్‌ ఆంటోనీగా విజయ్ దేవరకొండ కనిపించారు. ఇక సావిత్ర పెదనాన్న కేవీ చౌదరి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించారు. సావిత్రికి కారుడ్రైవర్‌గా కేవీ చౌదరి పనిచేశారు. సావిత్రి వెండితెరపై వెలిగిపోవాలని కలలు కన్నది.. ఆయనే. ఆమె మహానటిగా రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర ఆయనదే.

ఇటు సావిత్ర చిన్ననాటి స్నేహితురాలు.. సుశీల పాత్రలో అర్జున్‌ రెడ్డి హీరోయిన్ శాలినీ పాండే నటించారు. బాల్యంలో బలపడిన బంధం.. రాళ్లల్లో రాగాలు తీశారంటూ వచ్చిన టీజర్.. ఆలోచింపజేసింది. అలాగే మరో హీరోయిన్ కాజల్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఇలాంటి భారీ తారాగణంతో మన ముంగిట్లోకి వచ్చిన మహానటి.. ఆధ్యంతం అబ్బుపర్చింది. సావిత్రి జీవితంలోని అనేక కోణాలను ఆవిష్కరించింది.

ఈ హిస్టారికల్ క్లాసికల్ మూవీని.. వైజయంతి మూవీస్ సమర్పణలో.. స్వప్న సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories