మహానటి రివ్యూ & రేటింగ్

మహానటి రివ్యూ & రేటింగ్
x
Highlights

ద‌క్షిణాది తొలి మ‌హిళా సూప‌ర్‌స్టార్ సావిత్రి బయోపిక్ ని తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌స‌మే. 45 ఏళ్ల సావిత్రి జీవితాన్ని మూడు గంటల్లో చూపించడం...

ద‌క్షిణాది తొలి మ‌హిళా సూప‌ర్‌స్టార్ సావిత్రి బయోపిక్ ని తెర‌కెక్కించ‌డం అంటే సాహ‌స‌మే. 45 ఏళ్ల సావిత్రి జీవితాన్ని మూడు గంటల్లో చూపించడం అంటే..ఆశ్చర్యమే. డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో..ఎన్నో అంచనాలతో తెరకెక్కిన మహానటి సినిమా ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి సావిత్రి బయోపిక్ ని తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడా..? సావిత్రి గురించి ద‌ర్శకుడు కొత్తగా చెప్పిన విషయాలేంటి..?

కథ:

సినిమా బెంగ‌ళూరు చాళుక్య హోట‌ల్‌లో ప్రారంభమవుతుంది. చాళుక్య హోటల్ లో సావిత్రి కోమాలో ఉంటుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఎన్నో గొప్ప పాత్రలు చేసి మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి..కోమా స్టేజ్‌లోకి ఎందుకు వెళ్లింది..? అస‌లేం జ‌రిగింది అనే దానిపై ప్రజావాణి అనే పేపర్ న్యూస్ క‌వ‌ర్ చేయాల‌నుకుంటుంది. అందులో భాగంగా మ‌ధుర‌వాణి, ఫొటోగ్రాఫ‌ర్ విజ‌య్ ఆంటోని వివ‌రాలు సేక‌రిండటం మొదలుపెడతారు. మధురవాణి పాత్రలో సమంత, ఫోటో గ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. సినిమా క‌థ అలా స్టార్ట్ అవుతుంది. విజ‌య‌వాడ‌లో సావిత్రి బాల్యం నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం, స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డం. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న జెమిగ‌ణేశ‌న్‌ను వివాహం చేసుకోవ‌డం. అంత‌లోనే భ‌ర్తతో విభేదాలు రావ‌డం తాగుడుకి బానిస కావ‌డం. చివ‌ర‌కు కోమా ద‌శ‌లో ప్రాణాలు విడిచిపెట్టడం..ఇలా సావిత్రి జీవితంలో వివిధ కోణాలను సినిమాలో చూపించారు. అస‌లు సావిత్రికి భ‌ర్తతో ఎందుకు విబేదాలొచ్చాయి? ఎందుకు ఆమె కోమాలోకి వెళ్లింది? ఇలాంటి కొత్త విషయాలను సినిమాలు చూపించారు.

విశ్లేష‌ణ‌:

టైటిల్ పాత్రలో న‌టించిన కీర్తిసురేశ్ అచ్చం సావిత్రిలాగే ఒదిగిపోయింది. హావ‌భావాల‌ను కీర్తి సురేశ్ చ‌క్కగా ప‌లికించింది. జెమినిగ‌ణేశ‌న్‌లా దుల్కర్ స‌ల్మాన్ అద్భుతంగా న‌టించాడు. నిజ జీవితంలో జెమిని గ‌ణేశ‌న్ ఎలా ఉండేవారో..దుల్కర్ సరిగ్గా అలాగే నటించాడు. స్టార్ హీరోయిన్ స‌మంత పాత్ర చిన్నదే అయినా..అద్భుతంగా నటించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కూడా పాత్ర చిన్నదే అయినా..తన మార్క్ చూపించాడు. ఇక సావిత్రి పెద్ద నాన్న కె.వి.చౌద‌రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌, ప్రజావాణి పత్రిక ఎడిటర్ పాత్రలో త‌నికెళ్ల భ‌ర‌ణి, సావిత్రి త‌ల్లి సుభ‌ద్రమ్మ పాత్రలో భానుప్రియ, సావిత్రి మేన‌త్త దుర్గాంబ‌గా దివ్యవాణి, జెమిని గ‌ణేశ‌న్ మొద‌టి భార్య అల‌మేలు పాత్రలో మాళ‌వికా నాయ‌ర్‌, సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్రలో షాలిని పాండే త‌దిత‌రులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఎస్‌.వి.రంగారావుగా న‌టించిన మోహ‌న్‌బాబు, అక్కినేని పాత్ర‌లో నాగ‌చైత‌న్య చ‌క్కగా సూట్ అయ్యారు. ఇక అలూరి చ‌క్రపాణిగా ప్రకాశ్ రాజ్‌, ఎల్‌.వి.ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ అవ‌స‌రాల‌, ఆదూర్తి సుబ్బారావుగా సందీప్ వంగా, సింగీతం శ్రీనివాస‌రావుగా త‌రుణ్ భాస్కర్, కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ అంద‌రూ అతిథి పాత్రల్లో న‌టించి అల‌రించారు. సెకెండ్ ఆఫ్ కాస్త స్లోగా అనిపించినా..ఓవరాల్ గా ఆడియన్స్ కి నచ్చుతుంది.

డైరెక్షన్, మూవీ టీం డెడికేషన్:

మ‌హాన‌టి జీవిత‌గాథ‌ను తెర‌కెక్కించ‌డం సాధార‌ణ విష‌యం కాదు. కానీ.. వీరి ప‌ట్టుద‌ల వ‌ల్లే మ‌హానటి సినిమాగా రూపొందింది. విష‌యాన్ని సేక‌రించి దాన్ని నాగ్ అశ్విన్ అంద‌మైన సినిమాగా తీర్చిదిద్దాడు. సావిత్రి గురించి అంద‌రికీ తెలిసిన విష‌యాలే అయినా ఎక్కడా ఫ్లో మిస్ కాకుండా చ‌క్కటి సినిమా రూపంలోకి తీసుకొచ్చారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మిక్కీ జె.మేయ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు సంగీతం, నేప‌థ్య సంగీతం అందించిన సినిమాల‌కు భిన్నమైన సినిమా మ‌హాన‌టి. ఓ పీరియాడిక‌ల్ సినిమా. అందులో వివిధ కోణాలు ఆవిష్కరించారు.1970 నాటి ప‌రిస్థితుల‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం అంటే ప్రతీ విష‌యంలో ఓ పర్టికుల‌ర్ ఉంటుంది. దాన్ని ద‌ర్శకుడు చక్కగా పాటించాడు. సంగీతం, ఆర్ట్ వ‌ర్క్‌, కెమెరావ‌ర్క్ సినిమాకు వెన్నెముక‌గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్:

కీర్తి సురేష్ నటన స్క్రీన్ ప్లే మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్ సెకండ్ ఆఫ్ బాటమ్ లైన్ మ‌హాన‌టి..ఆకట్టుకుంటుంది రేటింగ్‌: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories