మహాకూటమిలో ముగిసిన సీట్ల సిగపట్లు...

మహాకూటమిలో ముగిసిన సీట్ల సిగపట్లు...
x
Highlights

పొమ్మన లేక పొగపెట్టడం అంటే ఇదేనేమో.. తెలంగాణ జనసమితి నేతలిప్పుడు ఇలాగే అనుకుంటున్నారు.. మహా కూటమి అంటూ అందరినీ ఒక్క తాటిపైకి కూర్చిన కాంగ్రెస్ తీరా...

పొమ్మన లేక పొగపెట్టడం అంటే ఇదేనేమో.. తెలంగాణ జనసమితి నేతలిప్పుడు ఇలాగే అనుకుంటున్నారు.. మహా కూటమి అంటూ అందరినీ ఒక్క తాటిపైకి కూర్చిన కాంగ్రెస్ తీరా సీట్ల కేటాయింపులో తన ఇష్టానుసారం చేసేసింది. స్నేహ పూర్వక పోటీల పేరుతో టీజెఎస్ ను మరింత గందరగోళానికి అయోమయానికి గురి చేస్తోంది. సీట్ల కేటాయింపు లోనూ చివరి వరకూ తాత్సారం చేసి సమయాన్ని వృథా చేసిన కాంగ్రెస్ ఎక్కడా సీట్ల కోసం త్యాగాలు చేయలేదు.. కోరిన సీట్లు ఎలాగూ ఇవ్వలేదు.. కనీసం తాము పోటీ చేసే స్థానాల్లో సైతం కాంగ్రెస్ తమ అభ్యర్ధులను పోటీకి పెట్టడంతో టిజేఎస్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న సానుకూల ధోరణి స్థానిక నాయకత్వంలో లేకపోవడం కోదండరామ్ ను సైతం బాధపెడుతోంది.మహాకూటమి ఏర్పడినప్పుడు14 సీట్లు కోరిన టిజేఎస్ ను కాంగ్రెస్ వార్ రూమ్ చుట్టూ తిప్పుకుని తిప్పుకుని... ఎడతెగని కాలక్షేపం చేసేసి.. ఆ తర్వాత కేవలం 8 అంటే 8 స్థానాలు కేటాయించింది. అయినా టీజెఎస్ పొత్తు ధర్మాన్ని పాటించి దానికీ ఆమోదం తెలిపింది. కనీసం ఇచ్చే 8 సీట్లయినా తాము ముందునుంచీ కోరుతున్న స్థానాలివ్వాలని కోదండరామ్ కోరినా.. కనీసం ఆ రిక్వెస్ట్ నీ కాంగ్రెస్ పరిశీలించలేదు.

సిద్దిపేట, వర్దన్న పేట, మల్కాజ్ గిరి మినహాయిస్తే మిగతా 11 స్థానాల్లో కాంగ్రెస్, టిడిపి బరిలో ఉన్నాయని టిజేఎస్ అంటోంది. జనగామ సీటును పొన్నాల కోసం కోదండరామ్ త్యాగం చేసినా మిర్యాల గూడ సీటును తమకు ఇవ్వక పోవడం టీజెఎస్ కు కోపం తెప్పిస్తోంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆర్. కృష్ణయ్యను కాంగ్రెస్ పోటీకి పెట్టింది. దీంతో తాము కూడా కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో పోటీలో నిలబడాల్సి వస్తోందని టీజేఎస్ చెబుతోంది. ఇదంతా టీజెఎస్ ను మూడు సీట్లకు పరిమితం చేయాలన్న కుట్రలో భాగమేనంటున్నారు మరికొందరు. కాంగ్రెస్ కూటమిలో ఉంటూనే వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు టీజెఎస్ ను కన్ ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నాయి.ఓవైపు పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న కోదండరామ్ ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories